: టీఆర్ఎస్ ఎంత దూసుకెళ్లినా కాంగ్రెస్ లోకి రావాల్సిందే: జానారెడ్డి
టీఆర్ఎస్ ఎంత దూసుకెళ్లినా కాంగ్రెస్ కక్ష్యలోకి రావాల్సిందేనని మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తమ పోరాటాలవల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్ ఎంత ప్రచారం చేసుకున్నా ఉపయోగం లేదని, చివరికి కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందేనని అన్నారు. ఎన్నికల తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున, తాము కృతజ్ఞత సభను నిర్వహించలేకపోతున్నామని జానారెడ్డి తెలిపారు.