: బిల్లుపై చర్చ ప్రారంభమైంది: నాదెండ్ల మనోహర్
శాసన సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమైందా? అని ఎంఐఎం పార్టీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను బీఏసీ సమావేశంలో ప్రశ్నించింది. స్పీకర్ బిల్లుపై చర్చ ప్రారంభమైందని స్పష్టం చేశారు. దీంతో పార్టీలు బిల్లుపై తమతమ వాదనలు వినిపించాయి. తాము చర్చకు సహరించేది లేదని, సమైక్య తీర్మానం చేశాకే బిల్లుపై చర్చ జరగాలని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది. అలా కాకుండా సభను జరపాలనుకుంటే అడ్డుకుని తీరతామని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. దీంతో ఏకాభిప్రాయం లేకపోవడంతో బీఏసీ సమావేశం అర్థాంతరంగా ముగిసింది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.