: బొత్సతో ముగిసిన హీరో శివాజీ, పాలెం బస్సు ప్రమాద బాధితుల భేటీ
పాలెం బస్సు ప్రమాద బాధితులు ఇవాళ (సోమవారం) ఉదయం రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. బాధితుల కుటుంబసభ్యులతో పాటు హీరో శివాజీ కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి తరఫున చర్చించారు. పాలెం బస్సు ప్రమాద బాధితులను ఆదుకోవాలని శివాజీ కోరారు. బాధితులకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇక ముందు.. బస్సు ప్రమాదాలు జరుగకుండా ప్రభుత్వం తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని శివాజీ డిమాండ్ చేశారు.