: ఢిల్లీలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. 90 విమానాలు రద్దు
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దాంతో విమాన, రైళ్ల సర్వీసుల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న (ఆదివారం) రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల మధ్యలో 90 విమానాలు నిలిచిపోయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. కొన్నింటిని దారి మళ్లించినట్లు చెప్పారు. అటు రైళ్ల రాకపోకలకు కూడా ఆటంకం కలిగింది.