: సినిమా అవకాశాలు లేవని ఉదయ్ బాధపడ్డారు: భార్య విషిత
చిత్ర పరిశ్రమలో తనకు సినిమా అవకాశాలు లేవని ఉదయ్ కిరణ్ తనవద్ద బాధ వ్యక్తం చేశారని భార్య విషిత పోలీసులకు తెలిపారు. అప్పుడు తాను నచ్చజెప్పేందుకు ప్రయత్నించానన్నారు. దాంతో, గత రెండు రోజులుగా నిరాశలో ఉన్నారని వివరించింది. బంధువుల పుట్టినరోజు వేడుకకు ఇద్దరం వెళ్లాల్సి ఉందని, కానీ, తను రాననడంతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లినట్లు చెప్పింది. ఆ వేడుకల్లో ఉండగానే ఉదయ్ నుంచి మెసేజ్ వచ్చిందని ఆమె చెప్పారు.