: కాంగ్రెస్ పై ఎవరూ ఆసక్తి చూపడం లేదు: కొత్తపేట ఎమ్మెల్యే
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పై అందరికీ ఆసక్తి తగ్గిందని, ఇతర పార్టీలవైపే చూస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. తనతోపాటు చాలామందికి ఇతర పార్టీల నుంచి ఆహ్వానం ఉందని చెప్పారు. అయితే, సీఎం కిరణ్ పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయన్న ఆయన, ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేస్తే విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు లేదని పేర్కొన్నారు.