: టీడీపీలో చేరనున్న ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి
కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి రెడీ అయిపోయారు. ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీలో చేరనున్నట్లు ఆయనీ రోజు ప్రకటించారు. వాస్తవానికి ఆయన గతంలో టీడీపీలోనే ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వచ్చాక అందులో చేరారు. ఇదే విషయమై శ్రీధర మాట్లాడుతూ.. అప్పట్లో కొన్ని కారణాలతో ప్రజారాజ్యంలో చేరానని చెప్పారు.