: రాష్ట్ర మహిళలకు చంద్రబాబు బహిరంగ లేఖ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర మహిళలకు బహిరంగలేఖ రాశారు. రాబోయే రోజుల్లో ప్రతి తెలుగింటి ఆడపడుచు ఆనందంగా ఉండేందుకు మహిళాయుగం తీసుకువస్తానని ఆయన లేఖలో పేర్కొన్నారు. మహిళలంతా తనకు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలకు 2014వ సంవత్సరం ఒక చిరస్మరణీయమైన మహిళాభ్యుదయ సంవత్సరంగా మిగిలిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.