: మూడుసార్లు ఆస్కార్ గెలిచిన సాల్ జెంజూ మృతి
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత, ఉత్తమ చిత్రాలు నిర్మించినందుకు మూడుసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సాల్ జెంజూ(92) అల్జీమర్స్ కారణంగా మృతి చెందారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయన స్వగృహంలో కాలం చెందినట్టు ఆయన మేనల్లుడు, వ్యాపార భాగస్వామి పాల్ తెలిపారు. ఆయన నిర్మించిన 'ద ఇంగ్లిష్ పేషంట్' సినిమా అత్యంత ప్రజాదరణ పొందింది.