: రష్యాకు అమెరికా భద్రతా సాయం
రష్యాకు అమెరికా భద్రతా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. నూతన సంవత్సర వేడుకలకు ముందు రష్యాలోని వోల్గోగ్రాండ్ లో చోటుచేసుకున్న బాంబుపేలుళ్ల నేపథ్యంలో సోచిలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ కు రష్యాకు అమెరికా భద్రతా సహాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు రష్యా ప్రతినిధులతో అమెరికా రక్షణశాఖ కార్యదర్శి చుక్ హాగెల్ మాట్లాడినట్టు పెంటగాన్ తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి 23 వరకు సోచిలో జరగనున్న వింటర్ ఒలిపింక్స్ లో భద్రతా సాయం కావాలని రష్యా కోరితే సాయమందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది.