: ముగిసిన ఏపీఎన్జీవో ఎన్నికలు... ఫలితాలు సాయంత్రం


ఏపీఎన్జీవో భవన్లో జరుగుతున్న ఆ సంఘ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 3 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నభోజన విరామం తరువాత, మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 835 ఓట్లకు గాను 815 ఓట్లు పోలయ్యాయని అధికారులు తెలిపారు. కాగా వీటి ఫలితాలు సాయంత్రం 8 గంటల్లోగా తెలుస్తాయి.

ఎన్నికల్లో సహకరించిన సహచరులందరికీ రెండు ప్యానెళ్ల అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సమైక్యతకు ఏపీఎన్జీవోలు కట్టుబడి ఉన్నారని వారు వెల్లడించారు. రెండు వర్గాల్లో ఎవరు గెలిచినా ఈ నెల 16 నుంచి 23 వరకు శాసనసభ బయట ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News