: ఇంగ్లిష్ వస్తే.. ఇక ఇన్ కమ్ మీదే!


మాతృభాషపై మమకారం ఉండొచ్చు, తప్పులేదు. కానీ, పరాయి భాష ఇంగ్లిషే నేడు శాసిస్తోంది. ఇంగ్లిష్ వచ్చిన వారు అంతగా రాని వారికంటే 34 శాతం అదనంగా సంపాదించగలుగుతున్నారని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. ఇంగ్లిష్ ప్రావీణ్యమే ఉపాధి అవకాశాలకు కొలమానమని స్పష్టం చేసింది. ఉత్తరాది రాష్ట్రాలలో నేటికీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే వారి సంఖ్య 25 శాతం లోపే ఉందట. ఇది పెరగాల్సిన అవసరం ఉందని అధ్యయనం నిర్వహించిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డిబేట్స్ ఇన్ డెవలప్ మెంట్ పాలసీకి చెందిన డాక్టర్ అబుసలే షరీప్ చెప్పారు. ఇక అసలు ఇంగ్లిష్ రాని వారికంటే ఏదో నాలుగు ముక్కలు వచ్చిన వారు కూడా 13 శాతం ఎక్కువే సంపాదిస్తున్నారని ఈ అధ్యయనంలో గుర్తించారు. దేశంలో 20 శాతం మంది నేడు ఇంగ్లిష్ లో మాట్లాడగలరని.. అందులోనూ 4 శాతం మందికే స్పష్టంగా మాట్లాడగలిగే సత్తా ఉందని అధ్యయనం పేర్కొంది.

  • Loading...

More Telugu News