: అఫ్జల్ ఉరిని ఖండిస్తూ పాక్ తీర్మానం


మనదేశ వ్యవహారాలలో తలదూర్చడం, భారతదేశంలో శాంతికి భంగం కలిగించే యత్నాలను పాక్ ఇంకా మానుకోలేదు. పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు అఫ్జల్ గురును ఉరితీయడాన్ని ఖండిస్తూ ఏకంగా ఆ దేశ పార్లమెంట్ గురువారం తీర్మానం చేయడమే ఇందుకు నిదర్శనం.

అంతేకాదు, అతడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని పాక్ పార్లమెంటులోని దిగువ సభ భారత్ ను డిమాండ్ చేసింది. అఫ్జల్ ఉరితో జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తీర్మానాన్ని జమాత్ ఉలేమా ఈ ఇస్లామ్ చీఫ్ మౌలానా ఫజుల్ రెహ్మాన్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. 

అఫ్జల్ భారతీయుడే అయినా, పాక్ ఉగ్రవాద సంస్థల ప్రోద్భలంతో భారత పార్లమెంట్ పై దాడికి ముష్కరులకు సహకారం అందించాడు. అఫ్జల్ పాత్రను నిరూపించే బలమైన సాక్ష్యాధారాల కారణంగానే సుప్రీం కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. అదీ భారత చట్టాల పరిధిలో సమగ్ర దర్యాప్తు, విచారణ తర్వాతే!

దేశ అత్యున్నత వేదిక అయిన పార్లమెంటుపై దాడికి పాక్ పరోక్షంగా కారణం. తీవ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ లో అస్థిరత రాజేయాలన్నదే ఆ దేశ వ్యూహం. ముంబై దాడులు సహా ఎన్నో ఘాతుకాలలో ఆ దేశ పాత్ర బయటపడింది. ఇప్పుడు అఫ్జల్ గురు ఉరిని ఖండిస్తూ పాక్ తీర్మానం చేయడం ఆ దేశ నిజరూపానికి నిదర్శనంగా నిలిచింది.  

  • Loading...

More Telugu News