: సీనియర్లకు చేతకాని చోట జూనియర్లు సత్తా చాటారు
షార్జా అంటే టీమిండియాకు ఏదో బెరుకు! ఇక్కడ పాక్ తో తలపడిన ప్రతిసారీ దాయాదిదే పైచేయిగా నిలుస్తూ వస్తోంది. టైటిల్ పోరు కోసం ఐదుసార్లు షార్జా గడ్డపై తలపడిన టీమిండియా ఒక్కసారి కూడా పాక్ పై విజయబావుటా ఎగురవేయలేదు. దీంతో 'షార్జా అంటే పాకిస్థాన్ జట్టుదే గెలుపు' అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సంప్రదాయాన్ని జూనియర్ టీమిండియా జట్టు బద్దలుకొట్టింది. సీనియర్లు విఫలమైన చోట జూనియర్లు సత్తా చాటారు.
ఆసియా కప్ లో అండర్ 19 టీమిండియా జట్టు షార్జాలో పాకిస్థాన్ జట్టుపై స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు సంజు సామ్సన్ 87 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 100 పరుగులు సాధించగా, కెప్టెన్ విజయ్ జోల్ 120 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్ ల సాయంతో 100 పరుగులు చేసి సత్తా చాటారు. దీంతో టీమిండియా 314 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు పోరాడినా భారత బౌలర్లధాటికి 274 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.