: నా ఆయుష్షు గట్టిదే.. డోంట్ వర్రీ: కేజ్రీవాల్
తన భద్రత గురించి ఆందోళన చెందవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోలీసులకు హితబోధ చేశారు. తన ఆయుష్షు రేఖ గట్టిదేనని, తనకేమీ కాదని ధీమా వ్యక్తం చేశారు. తన కోసం చిన్న ఫ్లాట్స్ చూడాలని సూచించారు. డూప్లెక్స్ హౌస్ ను ఆయన ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. వీఐపీ సంస్కృతిని దేశం నుంచి తొలగించాల్సిందేనని మరోసారి గట్టిగా చెప్పారు.