: నేడు మహారాష్ట్రలో మోడీ గర్జన


బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఈ రోజు మహారాష్ట్రలోని రాయగఢ్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. మోడీ దేశానికి ప్రమాదకరమంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు దీటైన జవాబును మోడీ ఈ సభలో ఇస్తారని భావిస్తున్నారు. మరోవైపు యోగా గురువు బాబారాందేవ్ మోడీని ఢిల్లీకి ఆహ్వానించారు. విదేశీ బ్యాంకుల్లో పోగుబడిన భారతీయుల నల్లధనాన్ని వెనక్కి రప్పించే విషయంలో చర్చించడం కోసం ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి రావాలని కోరారు. మరి మోడీ ఢిల్లీ వెళతారా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

  • Loading...

More Telugu News