: ప్రధాని అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు: ఏఏపీ
తమ పార్టీ ఇంకా ప్రధాని అభ్యర్థిని నిర్ణయించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నేత ప్రశాంత్ భూషణ్ చెప్పారు. ఆయన ఈరోజు (శనివారం) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము అత్యధిక స్థానాల్లో పోటీ చేయనున్నామని ఆయన తెలిపారు. అయితే.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నెల రోజుల్లోగా ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకొంటామన్నారు. లోక్ సభ స్థానాలకు సరైన అభ్యర్థుల జాబితాను రూపొందించే పనిలో ఉన్నామని ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు. ఏఏపీ అధినేత కేజ్రీవాల్ మాత్రం తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.