: మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయా?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ముందుంటాయి. నేడు వరల్డ్ కిడ్నీ డే. ఈ సందర్భంగా మూత్రపిండాల ఆరోగ్యానికి నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు.
* బీపీ పరిమితుల్లోనే ఉండాలి. 120/80 దాటి బీపీ ఉంటుంటే కిడ్నీలపై ప్రభావం పడుతుంది.
* మధుమేహ బాధితులు గ్లూకోజ్ స్థాయిలను పరిమితుల్లోనే ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* చెడు కొవ్వును పెరగకుండా చూసుకోండి.
* కొన్ని రకాల బీపీ నియంత్రణ మందులతో పాటు, పలు ఇతర వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ఈ విషయంలో వైద్యుల సలహా తప్పనిసరి.
* రుచి కోసం ఉప్పులేనిదే ముద్ద దిగదు కొందరికి. అయితే అధికంగా ఉప్పును తీసుకుంటే శరీరంలోకి సోడియం ఎక్కువగా చేరుతుంది. ఫలితంగా బీపీ పెరిగిపోతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. రోజులో 1500 మిల్లీ గ్రాముల సోడియం దాటి తీసుకోరాదు.
* తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది.
* మద్యపానీయం మానేయడం లేదా కనీసం తగ్గించడం అవసరం.
* శారీరక వ్యాయామం కూడా తప్పనిసరి
* బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి.
* ముఖ్యంగా పొగతాగడం కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో హానికరం. కనుక వెంటనే మానేయండి.
* మూత్ర, బీపీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటుంటే మీ ఆరోగ్య స్థితి తెలుస్తుంది.