: అజ్లాన్ షా హాకీ టోర్నీలో ముగిసిన భారత్ కథ!
మలేసియాలో జరుగుతున్న అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్ కథ ముగిసింది. ఫైనల్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు చేతులెత్తేశారు. న్యూజిలాండ్ తో ఈరోజు జరిగిన గ్రూప్ పోరులో భారత్ 0-2తో చిత్తయింది. ప్రథమార్థంలో గోల్స్ చేయడంలో ఇరుజట్లు విఫలం కాగా, ద్వితీయార్థంలో కివీస్ ఆటగాళ్లు రెండు గోల్స్ సాధించి భారత్ ఆశలపై నీళ్లు చల్లారు.
భారత్ కిది టోర్నీలో మూడో ఓటమి. నాలుగు మ్యాచ్ లాడిన భారత్ తొలి రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా చేతుల్లో పరాజయం పాలైంది. అయితే, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై నెగ్గడమొక్కటే భారత్ కు ఊరట.