: సంకల్ప దీక్ష విరమించిన ఎంపీలు


హైదరాబాద్ ఇందిపార్కు వద్ద సంకల్ప దీక్షను చేపట్టిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ దీక్షను విరమించారు. రాష్ట్రమంత్రి శైలజానాథ్ నిమ్మరసం ఇచ్చి వీరిచేత దీక్షను విరమింపజేశారు. దీక్ష విరమణ సమయంలో దీక్షా వేదిక వద్దకు చేరుకున్న తెలంగాణ వాదులు జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న సమైక్యవాదులు పోటీగా సమైక్య నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News