: కేసీఆర్ కి నీరో పోలికలున్నాయి: మోత్కుపల్లి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి రోమన్ చక్రవర్తి నీరోకి పోలికలు ఉన్నాయని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నట్టు... అసెంబ్లీలో చర్చ కోసం తాము తలలు బద్దలుగొట్టుకుంటుంటే ఫాం హౌస్ లో వ్యవసాయం అంటూ కొత్త నీతులు వల్లిస్తున్నాడని మండిపడ్డారు. ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని అన్నీ సంపాదించుకున్న కేసీఆర్ కుటుంబం... అమరవీరులను కనీసం గుర్తుచేసుకోవడం లేదని విమర్శించారు.