: మూడు ప్రముఖ బ్యాంకులపై ఆర్ బీఐ అనుమానం


దేశంలోని మూడు ప్రముఖ బ్యాంకులు నిబంధనలను తుంగలో తొక్కి యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు రిజర్వ్ బ్యాంకు అనుమానిస్తోంది. ఈ బ్యాంకులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న తమ బ్రాంచీల ద్వారా విచ్చలవిడిగా మనీలాండరింగ్ కు పాల్పడుతున్నాయని 'కోబ్రాపోస్ట్' అనే వెబ్ సైట్.. స్టింగ్ ఆపరేషన్ సాయంతో వెలుగులోకి తెచ్చింది.

ఈ నేపథ్యంలో ఆర్ బీఐ ఓ బ్యాంకుకు షోకాజ్ నోటీసు పంపింది. ఈ మూడు బ్యాంకులు ప్రాథమికంగా 'నో యువర్ కస్టమర్' (కేవైసీ).. నిబంధనలను గాలికొదిలేసినట్లు ఆర్ బీఐ నిర్థారించుకుంది. ఇక కోబ్రాపోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఆయా బ్యాంకుల సిబ్బంది.. కస్టమర్లు తెచ్చిన నల్లధనాన్ని ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఖాతాల్లోకి మరలిస్తున్న వైనం బట్టబయలైంది.

కాగా, కోబ్రాపోస్ట్ ఎడిటర్ అనిరుధ్ బహల్ మాట్లాడుతూ, 'మనీ లాండరింగ్ చేయాలంటూ వెళ్లిన మా రిపోర్టర్లకు హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. సీనియర్ మేనేజ్ మెంట్ కు ఇందులో భాగం లేకపోతే  ఈ రీతిలో స్వాగతం పలకరు కదా. అయినా, ఏ ఒక్క ఉద్యోగో ఇంత సాహసానికి ఒడిగట్టలేడు' అని వివరించారు. 

  • Loading...

More Telugu News