: కేసీఆర్ పై ఎర్రబెల్లి ఫైర్


వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల వసూళ్ల సొమ్మును కేసీఆర్ వాడుకుంటున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో వసూలు చేసిన నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునేందుకు ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని వేదికగా చేసుకున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ లాబీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్లు ఉచితంగా వస్తున్నాయని, బ్లాక్ మెయిల్ చేసి పంటను ఎక్కువ ధరకు కేసీఆర్ కొనిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ అసత్యాలు ఆపేసి.. నిజాలు మాట్లాడాలని అన్నారు. వ్యవసాయంలో తాను 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే కేవలం 5 లక్షలే వెనక్కి వచ్చాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా లేదని ఎర్రబెల్లి తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News