: యూజర్ల సమాచారం భద్రం: స్కైప్


సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీ హ్యాకింగ్ దాడి చేసినా యూజర్ల సమాచారం సురక్షితంగా ఉందని స్కైప్ స్పష్టం చేసింది. యూజర్ల భద్రత విషయంలో రాజీపడేది లేదని పేర్కొంది. ఇటీవల సైబర్ దాడిని గుర్తించామని, దాన్ని సమర్థంగా అడ్డుకున్నామని స్కైప్ ప్రతినిధి వెల్లడించారు. స్కైప్ వాడొద్దంటూ ఫేస్ బుక్, ట్విట్టర్లోని స్కైప్ పేజీలలో సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీ(ఎస్ఈఏ)పేరుతో సందేశాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News