: ఎంపీలు, కేంద్ర మంత్రులు జాతి ద్రోహులు: నల్లమోతు చక్రవర్తి


సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు జాతి ద్రోహులని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి అన్నారు. హైదరాబాద్ లోని సంకల్ప దీక్షా శిబిరంలో ఎంపీలకు మద్దతు తెలిపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఎంపీలు, కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో విశాలాంధ్ర మహాసభ ప్రచారం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. విభజన బిల్లును అడ్డుకునేందుకు ఉన్న ప్రతి అంశాన్ని తాము వినియోగించుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలంతా సమైక్యానికి కట్టుబడి ఉండి విభజనను అడ్డుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News