: భద్రాచలంలో వైభవంగా అధ్యయనోత్సవాలు


ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీరామాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామచంద్రస్వామి వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రాద్రి రాముడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఉదయం గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించి స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా.. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని దేవాలయ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News