: ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం భరోసా


పెరిగిన డీజిల్ ధరలతో నష్టపోనున్న ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజిల్ వల్ల అదనంగా పడనున్న రూ. 715 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఓ విధానం రూపొందించిందని బొత్స తెలిపారు. 

హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఆర్టీసీ కళాభవనంలో ఇంధన పొదుపు పాటించిన ఉత్తమ డ్రైవర్లకు అవార్డులు అందించే కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఛైర్మన్ ఎం. సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని కితాబు ఇచ్చారు.

  • Loading...

More Telugu News