: వారిద్దరూ దేశానికి వినాశకారులే: ఆమ్ ఆద్మీ
ప్రధాని అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి వాగ్బాణాలు సంధించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలు ఇద్దరూ దేశానికి వినాశకారులేనని ధ్వజమెత్తింది. మోడీ, రాహుల్ లలో ఎవరు ప్రధాని అయినా దేశం నాశనమవుతుందని వ్యాఖ్యానించింది. అయితే, ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయంలో రెండు పార్టీలు మాటల యుద్ధం చేయడంవల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. దేశంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.220 పెరగడంవల్ల పేద ప్రజలు ఎలా మనగలుగుతారని నిలదీశారు.