: ఇన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగడం తేలిక కాదు: సోనియాగాంధీ


భర్త రాజీవ్ గాంధీ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో... కాంగ్రెస్ పార్టీని తన అధినాయకత్వంతో విజయపథంలో నడిపిస్తున్న సోనియాగాంధీ, పార్టీ పగ్గాలు చేపట్టి 15 సంవత్సరాలు పూర్తయింది. దీనిపై స్పందించిన సోనియా గురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

"కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇన్ని సంవత్సరాలు 
కొనసాగడం అంత తేలికైన విషయం కాదు. పార్టీ నేతలవల్ల, వారు చూపించే ప్రేమ, ఆప్యాయత, అట్టడుగుస్థాయి పార్టీ శ్రేణుల మద్దతుతోనే ఈ రోజు ఇంత స్థాయికి చేరుకున్నాను. ఈ క్రెడిట్ వారికే దక్కుతుంది" అన్నారు సోనియా.

1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా..
 రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తూ అపూర్వ అధినాయికగా పేరు సంపాదించారు.

  • Loading...

More Telugu News