: పూణెలో ఈ నెల 10న సూకీ, మలాల ప్రసంగం
ఈ నెల పదవ తేదీనుంచి మూడు రోజుల పాటు పూణెలో 'భారతీయ విద్యార్థి పార్లమెంటు' సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల ప్రారంభపు రోజు అంటే 10వ తేదీన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మయన్మార్ ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీ ప్రసంగిస్తారని నిన్న(శుక్రవారం) ఓ అధికారి తెలిపారు. అనంతరం పాకిస్థాన్ సాహస బాలిక మలాల యూసఫ్ జాయ్ ప్రసంగం కూడా ఉంటుందని వెల్లడించారు. ఇందులో మలాల మహిళా విద్యపై, రాజకీయాల్లో యువత ప్రాధాన్యం గురించి మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.