: సీఎం వ్యవహారశైలిపై చర్చ జరగాలి: ఎర్రబెల్లి
టీబిల్లు చర్చ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ ఏకపక్షంగా, మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ టీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. అందువల్ల సభలో టీబిల్లుపై చర్చే కాకుండా, ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై కూడా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. విభజన బిల్లుపై జనవరి 23 వరకు ఓపికపట్టాల్సిన అవసరం లేదని, చర్చ జరగడానికి అవకాశం లేకపోతే... చర్చ పూర్తయిందని బిల్లును ఢిల్లీకి తిప్పి పంపాలని సూచించారు.