: ఆ మూలికతో గుండెపోటు తగ్గుతుందట
స్వల్పస్థాయి గుండెపోటుకు ఒక మూలికతో చక్కగా చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పురాతన కాలంనుండి మన చుట్టూ ఉన్న మొక్కల నుండే మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని మూలకాలు లభిస్తున్నాయనే విషయాన్ని ప్రాచీన కాలంలో ఋషులు గుర్తించారు. అలాగే చాలా వరకూ మూలికా వైద్యం మొండి రోగాలను నయం చేస్తుందనే విషయం ఎక్కువమందికి తెలియదు. తాజాగా నొప్పులకు చికిత్స చేసే ఒకరకమైన మూలికతో స్వల్పకాలిక గుండెపోటుకు కూడా చికిత్స చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు.
చైనాలో కొన్ని వందల ఏళ్లనుండి కోరిడల్లిస్ అనే పూలమొక్క వేరును తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకు చికిత్సగా వాడుతున్నారు. ఈ మొక్క మూలికల్లో డీహైడ్రోకోరీబల్బిన్ అనే పదార్ధం నొప్పులను నివారించడంలో చక్కగా ఉపయోగపడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కోరిడల్లిస్ పూలమొక్క వేరుల్లో ఈ పదార్ధంతోనే స్వల్పస్థాయి గుండెనొప్పికి చికిత్స చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ మొక్కలు చైనా మధ్య తూర్పుప్రాంతంలో విరివిగా పెరుగుతాయి.