: ఆసియా కప్, ప్రపంచ ట్వింటీ 20కి ఆతిథ్యమిస్తానంటున్న శ్రీలంక


ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఆసియా కప్, ప్రపంచ ట్వింటీ20కి ఆతిధ్యమిస్తామంటూ శ్రీలంక ముందుకొచ్చింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 7 వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆసియా కప్ టొర్నమెంట్ జరగనుంది. ఇక మార్చి 16 నుంచి ఏప్రిల్ ఆరు వరకు 16వ జాతీయ ప్రపంచ ట్వింటీ 20 టోర్నమెంట్ కూడా ఢాకాలోనే జరగనుంది. ప్రస్తుతం అక్కడ తీవ్ర అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో లంకలో నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ సెక్రెటరీ నిషాంత రణతుంగ ప్రతిపాదన తెచ్చారు. ఈ రోజు కొలంబోలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశమైంది. ఏసీసీ కోరుకుంటే తమ దేశంలోనే టోర్నమెంట్ నిర్వహించవచ్చని ఈ సందర్భంగా రణతుంగ తెలిపారు. తక్కువ సమయంలోనే లంకలో టోర్నమెంట్ కు అనుకూలమైన మైదానం, మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News