: అవన్నీ రూమర్లే.. వాడు బానే ఉన్నాడు: అమీర్ ఖాన్
తన తమ్ముడిని గృహనిర్బంధంలో ఉంచి బలవంతంగా మాత్రలు మింగిస్తున్నాడంటూ వచ్చిన వార్తలను బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఖండించాడు. మానసిక వ్యాధితో బాధపడుతున్నాడంటూ వచ్చిన వార్తలు వాస్తవం కాదని, ఫైజల్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నాడని అమీర్ ఖాన్ తెలిపాడు. తాను నటించే చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్ లను ఎంపిక చేయడంలో ఫైజల్ బిజీగా ఉన్నాడని చెప్పాడు. ధూమ్ 3 సినిమా ఎంపికలో ఫైజల్ దే కీలకపాత్ర అని అమీర్ తెలిపాడు. భవిష్యత్ లో కూడా ఫైజల్ నిర్ణయంపైనే ఆధారపడతానని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు.