: సమ్మె నోటీసుపై కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఎండీ చర్చలు
ఆర్టీసీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలంటూ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్రావు సమావేశమయ్యారు. వేతన సవరణ, కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లపై ప్రధానంగా చర్చలు జరుపుతున్నారు. గతంలోనూ కార్మిక సంఘాలు అనేక సార్లు తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసులు ఇచ్చారు. చర్చలు సాగినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్న విషయం విదితమే. తాజాగా మరోసారి కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడంతో ఎండీ వారితో చర్చలు జరుపుతున్నారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా బస్సులు నడిపి ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే అందుకు సిబ్బందికి అవసరమైన సూచనలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.