: వెంటిలేటర్ పై నటి సుచిత్రా సేన్
ప్రముఖ హిందీ, బెంగాలీ నటి సుచిత్రా సేన్ కు వెంటిలేటర్ అమర్చారు. ఈ మధ్యాహ్నం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వెంటిలేటర్ అమర్చినట్లు కోల్ కతాలోని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులతో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె ఫిజీషియన్ సుబ్రతా మైత్రా చెప్పారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారన్నారు. 82 సంవత్సరాల సేన్ శ్వాస సంబంధిత సమస్యలతో డిసెంబర్ 23న ఆసుపత్రిలో చేరారు.