: నవజీవన్ ఎక్స్ ప్రెస్ బాంబు బెదిరింపు ఆకతాయి పనే
చెన్నయ్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రైలును తెనాలి సమీపంలో నిలిపివేసి తనిఖీలు చేశారు. బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది రైలు వద్దకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. రైలును నిలిపివేయడంతో.. ఏం జరిగిందో తెలియక ‘నవజీవన్’లోని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సమయానికి గమ్యస్థానానికి చేరతామో, లేదోనని మరికొంత మంది తమ కుటుంబీకులకు సెల్ ఫోన్ లో తమ క్షేమ సమాచారాన్ని చేరవేస్తున్నారు.
అయితే బెంబు బాదిరింపు కాల్ ఆకతాయి పనే అని బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తేల్చారు. అన్ని బోగీలను తనిఖీలు చేశామని.. బాంబులేమీ లేవని వారు స్పష్టం చేశారు. ప్రయాణికులెవరూ ఆందోళన చెందనవసరం లేదని వారు చెప్పారు.