: రానున్న ఎన్నికల్లో ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీ
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయనుందని ఆప్ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు వినోద్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం పూర్తయిందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలో పోటీ చేసేవారందర్నీ స్థానికులే ఎన్నుకోవాల్సి ఉంటుందని అన్నారు. సభ్యత్వ నమోదు తరువాత క్రియాశీలకంగా పనిచేసి స్థానికుల్లో మంచి పేరు తెచ్చుకున్న వారినే పోటీలో దించుతామని ఆయన స్పష్టం చేశారు.