: హెలికాప్టర్ పేల్చేస్తానన్న పొన్నంపై సుమోటో కేసు పెట్టాం: డీజీపీ
కరీంనగర్ కు వస్తే సీఎం హెలికాప్టర్ ను పేల్చేస్తానన్న ఎంపీ పొన్నం ప్రభాకర్ పై సుమోటోగా కేసు నమోదైంది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా అదుపు చేయగలిగామని చెప్పారు. పెంచిన హోంగార్డు వేతనాలకు సంబంధించి వారంలోగా ఆదేశాలు జారీ అవుతాయని తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.
డిపాజిట్లు సేకరించేవారు, షేర్ల బిజినెస్ చేసేవారు బోర్డు తిప్పేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయని డీజీపీ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా వైట్ కాలర్ నేరాలు పెరిగాయన్నారు. క్రైం రేటు తగ్గించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. దోపిడీలు, దొంగతనాలను పోలీసులు అరికట్టారన్నారు.