: మినిస్టర్ క్వార్టర్స్ లో ముగిసిన తెలంగాణ నేతల భేటీ
హైదరాబాదులోని మంత్రుల నివాసంలో అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నేతలు సమావేశమై సమాలోచనలు జరిపారు. భేటీ అనంతరం నాగం జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శాసనసభా సమావేశాలు ముగిసేవరకూ.. పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలందరూ కలసికట్టుగా ముందుకు నడవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీలో ప్రతి రోజూ పార్టీకి ఇద్దరు చొప్పున ప్రతినిధులు కలిసి కూర్చుని కార్యాచరణపై చర్చించాలని నిర్ణయించారు. అలాగే సభలో సమైక్యాంధ్ర తీర్మానం కోసం పట్టుబడుతున్న తీరును నిరసిస్తూ శాసన సభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు.