: రైతు కంట 'పసుపు' నీరు!


ఆదిలాబాద్ జిల్లాలో 12,792 ఎకరాల్లో రైతులు పసుపు పంట వేశారు. తొమ్మిది నెలల కాలంలో ఎకరాకు రైతుకు సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చవుతోంది. ఈ సీజన్ లో వర్షాభావం పెరగడంతో తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గింది. గతంలో పసుపు క్వింటాల్ కు 15 వేల రూపాయల వరకు ధర పలికింది. దీంతో జిల్లాలో రైతులు పంట సాగు చేసేందుకు మొగ్గుచూపారు. గత నాలుగేళ్లుగా క్వింటాల్ కు 4,500 మించి ధర రావడం లేదు.

దీంతో రైతులు పంటను విక్రయించుకోవడానికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ మార్కెట్ కు, 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని సాంవ్లీ మార్కెట్ కు తరలించి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంట బాగా పండితే ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అయితే తెగుళ్లు సోకడంతో తాజా సీజన్ లో 15 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులకు ఈసారి కూడా ఆర్థిక బారం తప్పేటట్లు లేదు.

  • Loading...

More Telugu News