: భారతీ రిటైల్ కు కొత్త సీఈవో, సీఎఫ్ఓ


భారతీ రిటైల్ సంస్థ కొత్త సీఈవో, సీఎఫ్ఓలను నియమించింది. రిటైల్ రంగంలో వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసేందుకు వాల్ మార్ట్ ఇండియా మాజీ అధిపతి రాజ్ జైన్ ను సీఈవోగా, భారతీ వాల్ మార్ట్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసిన పంకజ్ మదన్ ని సీఎఫ్ఓగా నియమించింది. ప్రపంచస్థాయి వ్యాపారాన్ని నిర్వహించేందుకు భారతీ రిటైల్ కట్టుబడి ఉందని, అందులో భాగంగానే తాజా నియమకాలు జరిగాయని భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ రాజన్ భారతీ మిట్టల్ తెలిపారు.

  • Loading...

More Telugu News