: హైదరాబాదు-కాకినాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో కాకినాడకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు హైదరాబాదు నుంచి కాకినాడకు పన్నెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. వీటికోసం రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి రిజర్వేషన్ ప్రారంభమవుతుంది. 8, 10, 12, 14 తేదీల్లో రాత్రి 11.30 గంటలకు కాచిగూడ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. అంతేగాక 9, 11, 13, 15 తేదీల్లో కాకినాడ నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి.