: అసెంబ్లీకి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు: కోదండరాం


కుట్రపూరితంగా అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకుంటున్నారని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం మండిపడ్డారు. బిల్లులోని లోటుపాట్లను చర్చించే అధికారం మాత్రమే అసెంబ్లీకి ఉంటుందని చెప్పారు. అసెంబ్లీకి కేవలం అభిప్రాయాలు చెప్పే అధికారం మాత్రమే ఉంటుందని... నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదని అన్నారు. అసెంబ్లీ అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో కొన్ని సవరణలను కోరుతున్నామని చెప్పారు. ఈ రోజు హన్మకొండలో జరిగిన పీడీఎస్ యూ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News