: కేంద్రమంత్రి పళ్లంరాజును అడ్డుకున్న లాయర్ల జేఏసీ
కేంద్రమంత్రి పళ్లంరాజును లాయర్ల జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకోసం హైదరాబాదులో దీక్ష చేస్తున్న లాయర్లకు సంఘీభావం తెలిపేందుకు శిబిరానికి వచ్చిన మంత్రిని అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. దాంతో, పళ్లంరాజు అక్కడినుంచి వెనుదిరిగారు.