: ఎస్వీబీసీ ఛానెల్ నిర్వహణపై మండిపడ్డ గవర్నర్
టీటీడీ నిర్వహించే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ)పై గవర్నర్ నరసింహన్ మండిపడ్డారు. గత కొంత కాలంగా ఎస్వీబీసీ నిర్వహణలో లోపాలు, నిర్ణయాల్లో అశ్రిత పక్షపాతం, ఉద్యోగాల కేటాయింపుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో గవర్నర్ దృష్టికి కొన్ని ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో ఛానెల్ నిర్వహణపై టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజుకు గవర్నర్ పలు సూచనలు చేశారు. జనవరి 1వ తేదీన స్వామివారి ప్రత్యక సేవలను ప్రసారం చేయకుండా... భజనలు, పాటలతో కాలక్షేపం చేస్తారా? అంటూ కనుమూరిపై మండిపడ్డారు. శ్రీవారి సేవలను ఎందుకు ప్రసారం చేయలేదంటూ మండిపడ్డారు. టీటీడీలో ఏం జరగుతోందని ప్రశ్నించారు.