: జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఈ రోజు విచారించిన సీబీఐ కోర్టు ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. శాసనసభ సమావేశాలున్నందున కోర్టుకు రాలేకపోతున్నామని ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, మోపిదేవి వెంకటరమణ అభ్యర్థన మేరకు సీబీఐ కోర్టు కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News