: శాసనమండలి రేపటికి వాయిదా
సభ్యుల ఆందోళనల మధ్య శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఈ రోజు వాయిదా తరువాత ప్రారంభమైన శాసనమండలిలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలతో హోరెత్తించి ఆందోళనకు దిగారు. దీంతో మండలి ఛైర్మన్ చక్రపాణి శాసనమండలిని రేపటికి వాయిదా వేశారు.