: చిన్నారుల ఆరోగ్యం కోసం నా వంతు సాయం చేస్తా: మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నారుల ఆరోగ్యం కో్సం తన వంతు సాయం చేస్తానని ప్రకటించారు. ఈ రోజు హైదరాబాద్ మాదాపూర్ వద్ద 'రెయిన్ బో వుమెన్ అండ్ చిల్డ్రన్ ఆసుపత్రి'ని ఆయన ప్రారంభి్ంచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రెయిన్ బో ఆసుపత్రి అందిస్తున్న సౌకర్యాల పట్ల మహేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రి అత్యాధునిక సౌకర్యాల సాయంతో, అత్యుత్తమ సేవలను అందిస్తుందని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రెయిన్ బో హాస్పిటర్ డైరక్టర్ రమేష్ కంచర్ల, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.