: ప్రియను పెళ్లాడిన జాన్ అబ్రహం
బాలీవుడ్ సెక్సీ హీరో జాన్ అబ్రహం తన ప్రియురాలు ప్రియారంచాల్ ను గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే కేవలం కొద్ది మంది ముఖ్యమైన అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం. వీరి వివాహం జరిగిందనడానికి నిదర్శనంగా జాన్ ట్విట్టర్లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రియకు ట్వీట్ చేశాడు. దాని చివర్లో జాన్, ప్రియ అబ్రహం అని పేర్కొన్నాడు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అయిన ప్రియ, జాన్ 2010లో తొలిసారిగా తమ స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. దాంతో అప్పటి నుంచి గాఢంగా కొనసాగిన జాన్, బిపాషాబసు బంధం 2011లో రెండు చెక్కలైంది.